Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు Y+ సెక్యూరిటీ.

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కాళ్యాణ్‎కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ స‌చివాల‌యం వెళ్ల‌నున్న ప‌వ‌న్ త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించ‌నున్నారు. రేపు ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు చేపడతారు. ఇక స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‎కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు.