YS Sharmila Satires On CM YS Jagan : మీ చేతకాని కమిట్మెంట్..అన్నపై షర్మిల సెటైర్లు

0
13

ఎన్నికల తర్వాత విశాఖే రాజధాని ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానన్న సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్ పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేతకాని కమిట్మెంట్ అంటూ రెచ్చిపోయారు.

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అని ప్రశ్నించారు షర్మిల.

అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను షర్మిల ఇంటర్వ్యూ చేయడం గమనార్హం.