AP Politics: పేరు మార్చుకున్న ముద్రగడ

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: 2024 పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ ప్రజల దృష్టి మొత్తం పిఠాపురంపై పడింది. ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. అలాగే పవన్ గెలుపుపై కూడా బెట్టింగ్ లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏపీలో కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం కీలక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరడంతో పాటు.. పవన్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ గెలిచే ప్రసక్తే లేదని.. ఆయన గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరాడు. కాగా ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ముద్రగడ విసిరిన సవాల్ లో ఓడిపోవడంతో తన పేరును మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో స్పందించిన రిజిస్టర్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును.. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.