CBN: నువ్వే నా సర్వస్వం.. మీరే నాకు స్పూర్తి.. చంద్రబాబు, భువనేశ్వరిలు ట్వీట్స్.

0
23

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: నేడు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మెమొరెబుల్ ట్వీట్ చేశారు. ‘ఎప్పుడూ మద్ధతుగా, ధైర్యంగా, చీకటి రోజుల్లో సైతం చిరునవ్వుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంలో 100 శాతం తోడ్పాటునందించే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వే నా సర్వస్వం..’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు. థాంక్యూ అండి.. మీరే నాకు స్ఫూర్తి.. ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కోసం అంకితభావంతో పనిచేసే మీకు ఎప్పటికి మద్దుతుగానే ఉంటాను… అని చంద్రబాబు ట్వీట్‌కు నారా భువనేశ్వరి బదులిచ్చారు.