వందో టెస్ట్ మ్యాచ్.. ఫ్యామిలీతో స్టేడియానికి అశ్విన్

0
19

ఇవాళ ధర్మశాలలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 100వ టెస్టు మ్యాచు ఆడుతున్న సంగతి తెలిసిందే. మ్యాచుకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా ప్రత్యేక క్యాప్ను అశ్విన్ అందుకున్నారు. ఈ సందర్భంగా అశ్విన్తో భార్య. పిల్లలు ఉండటం గమనార్హం. టీమ్ సభ్యులు లెజెండరీ స్పిన్నర్కు అభినందనలు తెలిపారు. కాగా భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న 14వ ప్లేయర్గా గా అశ్విన్ నిలిచారు.

అశ్విన్ స్పిన్ మాస్టర్: పాంటింగ్

వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్న భారత స్పిన్నర్ అశ్విన్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ స్పిన్ మాస్టర్ అని కొనియాడారు. అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. బౌలర్గా తనను తాను మరింత మెరుగుపరుచుకునేందుకు అశ్విన్ ప్రయత్నిస్తారన్నారు. ఐపీఎల్లో ఢిల్లీ కోచ్గా అశ్విన్ను దగ్గరగా గమనించానని తెలిపారు.

భారత్: రోహిత్(C), జైస్వాల్, గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్, స్టోక్స్(C), ఫోక్స్, హార్టీ, బషీర్, అండర్సన్, మార్క్ వుడ్.