AP Politics: కాంగ్రెస్‎లోకి వైసీపీ విలీనం.. నల్లిమిల్లి సంచలన వ్యాఖ్యలు

0
18

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ పార్టీ.. ఎన్నికల సమయంలో అన్ని స్థానాల్లో గెలుపు మాదేనన్న ధీమాతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. అసలు ఓటమి గల కారణం ఏంటి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశాల మీదా సమావేశారు ఏర్పాటు చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించరనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామక‌ృష్ణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. పద్దెనిమిది స్థానాలు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ వైసీపీకి అవి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో దిక్కులేని పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న(సోమవారం) ఆయన బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారని చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని ఆయన తెలిపారు.