పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పూణె పోర్షే ప్రమాదం కేసులో నిందితుడైన మైనర్‌కు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. జువైనల్ హోం నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అబ్జర్వేషన్ హోమ్‌లో కొనసాగించడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. నేరం ఎంత తీవ్రమైందయినా ఇతర పిల్లలతో ఎలా వ్యవహరిస్తామో అలాగే నిందితుడితో కూడా వ్యవహరించాలని న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. నిందితుడి బందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. నిందితుడి వయస్సు 18 ఏళ్లలోపు ఉన్నందున అబ్జర్వేషన్ హోంకు పంపాలన్న జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలను కొట్టి వేసింది. కాగా, మే 19 అర్ధరాత్రి పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్న ఓ అబ్బాయి, అమ్మాయిని మైనర్ నిందితులు కారుతో ఢీకొట్టడంతో వారిద్దరూ మరణించిన విషయం తెలిసిందే.