PawanKalyan: అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్.. శ్రీరెడ్డి కామెంట్స్

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. అయితే పవన్ కళ్యాణ్ అమ్మవారి బట్టల్లో చెప్పులు వేసుకుని దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో జనాలను ఆకట్టుకుంటున్నప్పటికీ పవన్ చెప్పులు ధరించడం పలువురు జనాలను షాక్‌కు గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలను కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ పిక్‌కు ‘బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్’ అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను జోడించింది శ్రీరెడ్డి.