Kalki 2898 AD: బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్కి.. కలెక్షన్లు ఎంత అంటే..?

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చించుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇందులో తెలుగు, హిందీ స్టార్ సెలబ్రిటీలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఇందులోని యాక్షన్ సీన్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, సమాచారం ప్రకారం.. తెలుగులో రూ. 70 కోట్లు, హిందీలో రూ. 25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 10 కోట్లు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి రూ. 180 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్. అయితే తెలుగులో మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల రికార్డ్స్‌ను కల్కి బ్రేక్ చేయలేకపోయింది. ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లు సాధించి మొదటి ప్లేస్‌లో ఉండగా.. బాహుబలి-2 రూ. 217 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే కల్కి మూవీ ఈ రెండు చిత్రాల రికార్డు బద్దలు కొట్టినప్పటికీ రూ. 180 కోట్లతో మూడవ స్థానం దక్కించుకున్నట్లు టాక్.