Vasireddy Padma Gives Shok To CM Jagan: జగన్‌కు షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

0
17

ఎన్నికలకు ముందు ఏపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. రిజిగ్నేషన్ లేఖను సీఎం జగన్ కు పంపించారు. రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి లో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని గతంలోనే ఆమె సీఎంను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. వాసిరెడ్డి పద్మ జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో ఒకరు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. అంతకుముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా వాసిరెడ్డి పద్మ రాజకీయాలోకి వచ్చారు. ఆమె ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు