షేప్స్ కోసం సర్జరీ చేయించుకున్నా.. అనన్య నాగళ్ల వైరల్ కామెంట్స్

0
15

తెలుగు అమాకత్వం.. అందం.. నార్తిండియా షేపులు కలిస్తే అనన్య నాగళ్ల. మల్లేశం సినిమాతో మెల్లగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా చేసే రచ్చ మామూలుగా ఉండదు. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి.. తన అందంతో సత్తా చాటుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఓ కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ తంత్ర. మార్చి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిలర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ దావత్ అనే షోలో పాల్గొని సందడి చేసింది. అందులో తన సర్జరీకి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మీరు ఎప్పుడైనా అలాంటి సర్జరీ చేయించుకున్నారా అంటూ అనన్యకు ప్రశ్న ఎదురైంది. అనన్య స్పందిస్తూ నిర్మొహమాటంగా అవును చేయించుకున్నాను అంటూ ఒప్పుకుంది. తాను లిప్ పిల్లర్ వేయించాను అది వేసి రెండేళ్లు అవుతుంది.. ఇప్పుడు పోయినట్టుంది అని వివరించింది. లిప్ ఫిలర్ అంటే పెదాలు షేప్ వచ్చేలా చేసే ఓ చిన్న సర్జరీ.

ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి అనన్య నాగళ్ల వివరించింది. కార్లు, అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఆ సెలబ్రెటీస్ ను వేరే విధంగా చూస్తారని.. అవి లేని వారిని అసలు పట్టించుకోరని చెప్పుకొచ్చింది. సమంత, అలియా భట్ తనకు ఇన్స్పిరేషనల్ హీరోయిన్స్ అని వివరించింది అనన్య.