TS News: సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి సపోర్టు.. ఎందుకంటే..?

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: డ్రగ్స్ పై రేవంతన్న చేస్తున్న పోరాటానికి మెగాస్టార్ మద్దతు అంటూ కాంగ్రెస్ శ్రేణులు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తరుపున మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో నటించారు. ఈ యాడ్ లో గ్రడ్స్ భారిన పడిన ఓ వ్యక్తి కుటుంబం పడే కష్టాలను చక్కగా వివరించారు. అంతేగాక మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరోకి తెలియజేయాలని, 8712671111 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అంతేగాక బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయడమే వారి లక్ష్యం తప్ప శిక్షించడం కాదు అంటూ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపాలని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.