Telangana: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్ తొలి వర్ధంతి.. వైరల్‎గా మారిన ఆయన కొడుకు-కూతురు పాట

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్ జూన్ 29, 2023న హఠాన్మరణం చెందారు. తన ఫామ్ హౌస్‌కు వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుతో మరణించడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయిచంద్ పాడిన ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఆ పాట కోట్ల మందిని మనసుల్ని కదిలించింది. జానపదాన్ని నింపుకుని తన గానంతో ఎంతో మంది కళ్లల్లో కన్నీళ్లు తెప్పించారు. ఇప్పటికి ఈయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. అయితే నేడు సాయిచంద్ తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కొడుకు-కుమార్తె.. ‘నాన్న నాన్న నీ మనసెంత గొప్పదో నాన్న’ అంటూ పాట పాడారు. ఈ పాటకు నాన్నతో ఉన్న జ్ఞాపకాలను వీడియో రూపంలో చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్.. ఉస్మానియా యూనివర్సీలో పరిచయమైన రజనిని ప్రేమించి పెళ్లిచేకున్నారు. ఇద్దరి ఉద్యమం ఒక్కటి కావడంతో మనసులు కలిశాయి. పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమారుడు చరీష్, కుమార్తె నది ఉన్నారు. సాయి చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు పాల్గొని..సాయి చంద్‌తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.