Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఒడిశా తీరం వెంట అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారుల వెల్లడించారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌‌ను జారీ చేసింది. ఒడిశా తీరం వెంట ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయువ్య వైపుగా కదిలే అవకాశం ఉందని.., సోమవారం, మంగళవారం వరకు ఉమ్మడి వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈదరుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జులై 2 వరకు ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల ఆసిఫ్రాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.