TTD: తిరుమలలో భక్తుల రద్ధీ.. ఒక్క రోజులో శ్రీవారిని దర్శించుకున్న 81వేల మంది

0
32

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి పోటెత్తారు. దీంతో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్ముమెంట్లు నిండిపోయాయి. స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకు 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28,244 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.