CBN: సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ

0
33

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనమాక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అధికారులు సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ అని చంద్రబాబుతో అన్నారు దీనికి చంద్రబాబు బదులిస్తూ లేదు సెట్ అయ్యారు అని చెప్పారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్ అని లోకేష్ అనడంతో పరదాలు కనిపిస్తే సస్పెండ్ చేస్తా అని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

అధికారులు ఎవరైనా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి వచ్చి పని చేయాల్సిందే అన్నారు. ఎవరైనా అధికారుల మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్స్ తప్పవన్నారు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు పడాల్సిందే అని సీబీఎన్ అన్నారు. రివర్స్ వెళ్లే బండిని ముందుకు తీసుకెళ్తున్నామని.. స్పీడ్ గా వెళ్లాల్సిందే తప్పా రివర్స్ వెళ్తే కుదరదు అని తేల్చి చెప్పారు. షాక్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. 1995లో లోకేష్ కుర్రాడు అని.. అయితే హైదరాబాద్ నుంచి తాను బయల్దేరుతున్నా అంటే రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్ ఉండేదని.. ఇప్పుడు అలా ఏం ఉండదాని కానీ 4.0లో అందరూ జాగ్రత్తగా పనిచేయాల్సిందే అన్నారు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/F7HUct7q-wc?si=3TkKWJGWNB5CJtj9