Parliament: హిందూ సమాజంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘటు వ్యాఖ్యలు.. మండిపడ్డ ప్రధాని మోదీ

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సమావేశంలో హిందూ సమాజంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న బీజేపీ సభ్యులకు కోపం తెప్పించింది. దీంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. హిందూ సమాజంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కోపం తెప్పించడంతో సోమవారం లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. విపక్ష సభ్యుడిగా మొదటి సారి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ మన మహానుభావులందరూ అహింస, భయాన్ని అంతం చేయడం గురించి మాట్లాడారు. కానీ, తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం, అసత్యం గురించి మాత్రమే మాట్లాడతారు. ఆప్ హిందూ హో హాయ్ నహీ..’ అని అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ‘హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని.. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పిలవడం చాలా తీవ్రమైన విషయం’ అని ప్రధాని మోదీ అన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీ మాట్లాడుతూ.. హిందువులపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులు తమను తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్నారని ఇది రాహుల్ గాంధీకి తెలియదన్నారు. మీరు హింసను ఏ మతంతోనూ ముడిపెట్టలేరని.. రాహుల్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నానని అమిత్ షా ఫైర్ అయ్యారు. దీంతో సభలో విపక్ష, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది.’