Raghava Lawrence: వారసుడిని పరిచయం చేసిన రాఘవ లారెన్స్.. మీ అందరి ఆశీస్సులు కావాలి

0
40

పాయింట్ బ్లాంక్, సినిమా: డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే.. ఈయన గొప్ప మససు గురించి కూడా అందరికి తెలిసిందే. అనాధ పిల్లలకు, ఎంతో మంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా తనకు చేతనైనా సాయం చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే.. రాఘవ లారెన్స్ తన కొడుకు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏ తండ్రి అయినా వారసత్వంగా కొడుకులకు ఆస్తులు ఇస్తారు. కానీ రాఘవ మాత్రం తన సేవా గుణాన్ని కొడుకుకు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొడుకు చదువుకుంటూ.. పార్ట్ టైం జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులను పేదలకు ఉపయోగిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అతనికి మీ ఆశీస్సులు కావాలంటూ లారెన్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. నేను నాటిన విత్తనం ఇప్పుడు ఉదారమైన అబ్బాయిగా ఎదిగింది. అతను శ్యామ్, ప్రస్తుతం కాలేజీలో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల నుండి నేను హెప్సిబా చదువు కోసం ఆమెకు మద్దతు ఇస్తున్నాను. రాయపురానికి చెందిన ఈమె చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు హెప్సిబా కోసం శ్యామ్ ఈ ఏడాది స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఆనంద క్షణాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. శ్యామ్ సేవా యాత్రకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రాఘవ లారెన్స్ పోస్ట్ వైరల్ అవుతుంది.