Breaking: విజయ్ మాల్యాకు షాక్.. కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

0
29

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ. 180 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ చేసింది. కోర్టు జూన్ 29న మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే దాని ఉత్తర్వులు మాత్రం సోమవారం అందుబాటులోకి వచ్చాయి. కాగా, సీబీఐ వాదనలు విన్న కోర్టు.. మాల్యా పరారీని ప్రస్తావించింది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ఈ కేసు సరిగ్గా సరిపోతుందని.. దివాలా తీసిన ఎయిర్‌లైన్స్ కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.180 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యాను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతను లండన్‌లో ఉన్నాడు. అతన్ని అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.