TS Politics: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తాను చేసిన సేవలను ప్రజలు మర్చిపోయారని.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటిమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ ఎమ్మెల్యే పదవి కోసం నేను అడుక్కోవాలా..? అలా అడుక్కునే పదవి నాకు వద్దు.. నేను పదవి లేకున్నా బతుకుతానని గొంతెత్తి చెప్పుకొచ్చారు. నేను ఓట్ల కోసం సేవ చేయనని వెల్లడించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా నాకు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. కానీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే.. నేను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని ప్రచారం చేశారు’ అని అన్నారు. దీంతో బాధేసిందని జగ్గారెడ్డి ఎమోషనల్ అయ్యారు.