TS News: ఆదివాసీలతో ముఖాముఖి సమావేశమైన మంత్రి సీతక్క

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: అధికారిక హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ధనసరి అనసూయ సీతక్క రెండోసారి నల్లమల్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా.. మంగళవారం ఉ. 11:45 గంటలకు అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని అటవీశాఖ వనమలిక వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చెంచులతో ప్రత్యేకంగా వనమాలికలు చెట్ల కింద చెంచులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసి చెంచు గిరిజనులు దీర్ఘకాలిక సమస్యలు పొడుభూలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని.., సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని.., ప్రధానంగా రాష్ట్ర ఏర్పడి 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మన్ననూర్ ఐటీడీఏకు రెగ్యులర్ ఐఏఎస్ అధికారినీ పీవోను నియమించకపోవడం వల్ల చెంచుల అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని తెలిపారు.

అలానే రెగ్యులర్ ఐఏఎస్ పిఓతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని.., స్థానికంగా ఆదివాసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న చెంచు గుడాలకు, పెంటలకు రోడ్డు మార్గాలు, మంచినీరు, వైద్యం, ఉపాధి నివాసం కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు సరైన వైద్య సేవలు అందాలంటే అప్పాపూర్ లో గతంలో మంజూరైన వైద్య కేంద్రాన్ని తిరిగి పునరుద్ధరించాలని, ఐటిడిఏ కు ప్రత్యేకంగా 100 కోట్ల ప్యాకేజీని కేటాయించాలని, చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా స్పెషల్గా ప్రత్యేక వైద్య వింగ్ నియమించాలని అన్నారు. ఆదివాసీలు పోషకాహారం, రక్తహీనతతో చాలామంది అకాల మరణాలు చెందుతున్నారని.., చెంచులు తిరిగి వ్యవసాయం చేసుకునేందుకు కావలసిన కడెద్దులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు భూమి సాగు చేసుకునేందుకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అలాగే చెంచులకు జీవనోపాధి కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చెంచుల కోసం స్పెషల్ డిఎస్సి నిర్మించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరారు మంత్రి సీతక్క.