పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక విభాగమైన ఇంటలిజెన్స్ చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్హా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ సీఎస్‌కు రిపోర్ట్ చేశారు. అనంతరం, లడ్హాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా పని చేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, ఇంటలిజెన్స్ విభాగంలో ఐజీగా పని చేశారు. అనంతరం మహేష్‌చంద్ర లడ్హా సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా సొంత రాష్ట్రానికి వచ్చారు.