TS Politics: వ్యవసాయక్షేతంలో మంత్రి పొంగులేటి.. బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

0
39

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కల్లూరు మండలంలోని నారాయణపురంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. తెల్లచొక్కా, తెల్ల లుంగీలో న్యూలుక్‌లో అదరగొట్టారు. పచ్చని పంట పొల్లాల్లో కలియతిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. స్థానిక రైతులతో ముచ్చటించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకున్నారు మంత్రి. కాగా, పొంగులేటి ట్వీట్‌పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.