Ap Volunteers Public Servants Or Ycp Servants..? వాలంటీర్లు ప్రజా సేవకులా.. వైసీపీ సేవకులా.. హాట్ టాపిక్

0
23

జగన్ సర్కారు వచ్చినప్పటినుంచి ఏపీలో యాక్టివ్ చర్చలోకి వచ్చారు వాలంటీర్లు. వీళ్లు ప్రజా సేవకులా.. జగన్ పార్టీ సేవకులా.. అన్నదానిపై ఉత్కంఠ వివాదం మరే అంశంపైనా లేదు. వీరికి తిరుగులేదని వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా.. ఈ నియామకాలకు చట్టబద్ధతే లేదన్నది అపోజిషన్ వాదన.

వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ వ్యవస్థను పెట్టి ఓటర్లను ప్రజలను బెదిరిస్తున్నారని.. ప్రజాధనంతో పార్టీ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు.. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత.. తాము వాలంటీర్ వ్యవస్థను తీసేయబోమని ప్రకటించారు. ఇంకా వారికి మెరుగైన అవకాశాలు కలిపిస్తామని.. కానీ వైసీపీకి మాత్రం ఊడిగం చేయవద్దని అంటున్నారు.

బాబు, పవన్ ఓవైపు హెచ్చరిస్తూనే.. ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దని వాలంటీర్లకు సూచిస్తున్నారు. మరోవైపు వాలంటీర్లలోనూ ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలత లేదన్న వాదన ఉంది. ఐదేళ్లుగా ఐదు వేల రూపాయలకే పని చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇతరత్రా.. తాయిలాలు ఇస్తున్నారు కానీ.. ఎలాంటి ఉద్యోగభద్రత లేదు. ఎలాంటి అవకాశాలు వస్తాయన్న ఆశలు కల్పించడం లేదు. కనీసం ఉద్యోగప్రకటనల్లో రిజర్వేషన్లు అయినా కల్పిస్తారంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. భవిష్యత్ లో జీతం పెంచుతారని కూడా లేదు. అందుకే వాలంటీర్లకు తమ భవిష్యత్ పై బెంగ ఉందన్న అభిప్రాయం ఉంది. వాలంటీర్లపై జగన్ పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా.. లేక బాబు, పవన్ చెప్పినట్టు మార్పు వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.