పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో కడప ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేసి ఆ స్థానంలో తన భార్య భారతిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారనే ప్రచారం జరగుతోంది. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో వైఎస్ జగన్ ఉంటారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం వైఎస్ జయంతి కార్యక్రమానికి మంగళగిరి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కడప ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అనుకోకుండా కడప ఉప ఎన్నికే వస్తే.. తాను అన్ని విధాలుగా షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఆమె గెలుపు కోసం ఏమైనా చేస్తానని.., అవసరం అయితే, కడపలోనే మకాం వేసి గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. షర్మిల తిరుగులేని నాయకురాలిగా ఎదిగేందుకు కడప ఉప ఎన్నిక ఓ సువర్ణావకాశం లాంటిదని అన్నారు. అలానే 2029 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ షర్మిల సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.
Home పాలిటిక్స్ ఏపీ AP Politics: కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. వైఎస్ జగన్‌ను తప్పకుండా ఓడిస్తా-తెలంగాణ...