AP News: మందలించినందుకు ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి.

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఈ లోకంలో గురు, శిష్యుల బంధం చాలా పవిత్రమైంది. ఓ వ్యక్తికి విద్యా బుద్ధలు చెప్పి, వాడిని సరైన దారిలో నడిపే వాడే ఉపాధ్యాయుడు. ఇంట్లో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూస్తే.. పాఠశాలలో విద్యతో పాటు ఉన్నత విలువలను నేర్పేవాడే గురువు. అలాంటి గురు, శిష్యుల బంధానికి ఓ నీచుడు మచ్చతెచ్చిన ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన రాజేష్ అస్సాంలోని శివసాగర్‌ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్సిపల్, లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయంటూ పవర్తను మార్చుకోవాలంటూ ప్రిన్సిపల్ రాజేష్ అతడిని మందలించాడు. దీంతో అతడిపై ఆ విద్యార్థి తీవ్రంగా కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్ తరగతి గదిలో క్లాసు చెబుతుండగా అతడిపై విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రిన్సిపాల్ కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.