News: అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్.. నలుగురు తెలుగు వారు అరెస్ట్

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: అమెరికాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది యువతులను ప్రిన్‌స్టన్ పోలీసులు కనుగొన్నారు. అనంతరం వారినుంచి సమాచారం సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్‌గా నిర్ధారించారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు ఉండగా.., వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అరెస్టు చేసిన వారిని చందన్ దసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే అనే వ్యక్తులుగా గుర్తించారు. అలాగే కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందని తెలిపా