అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ‘శుభ్ ఆశీర్వాద్’ ఫంక్షన్‎కు హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన

0
41

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు. ప్రపంచ ప్రముఖులందరూ ముంబైకి తరలివస్తున్నారు. అందుకు కారణం… అపర కుబేరుడు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) వివాహ మహోత్సవమే. వేడుకల్లో భాగంగా ముంబయిలోని జియో(Jio) కన్వెన్షన్ సెంటర్‎లో శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు కూడా హాజరయ్యారు.

రామ్ చరణ్ బంద్ గలా సూట్ ధరించగా… ఉపాసన గాగ్రా డ్రెస్‎లో తళుక్కుమన్నారు. రామ్ చరణ్, ఉపాసన… నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్(Radhika Merchant) లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయితే బుచ్చిబాబు సానా డైరెక్షన్‎లో స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..