TS News: రాజా రిత్విక్ తెలంగాణవాడు కావడం సంతోషంగా ఉంది- సీఎం రేవంత్ రెడ్డి

0
30

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన రాజారిత్విక్(Raja Rithvik) ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్ షిప్‎లో రజత పథకం గెలుచుకున్నాడని.. అతడికి అభినందనలు తెలియజేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పెషల్ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‎లో జరుగుతున్న ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‎లో రిత్విక్ సిల్వర్ మెడల్ సాధించాడని ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ప్రచురించిన కధనాన్ని ట్వీటర్‎లో పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ ఫ్రాన్స్‌లో జరిగిన లాప్లాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్‌ షిప్‌‎లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుపొందిన రాజరిత్విక్.. మన స్వంత యువ చెస్ స్టార్ అవ్వడం ఆనందంగా ఉంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌కి అభినందనలు.. టోర్నీలో అజేయంగా నిలిచాడు.. ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కేవలం ఆఫ్ పాయింట్‌తో కోల్పోయాడు. అతడు ఇకముందు మరింతగా రాణించాలని కోరుకుంటూ, అతని ముందున్న ప్రయాణంలో అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తాము. ’ అని హామీ ఇస్తున్నాట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..