AP Politics: మహారాష్ట్ర సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే..!

0
64

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అదివారం నాడు భేటీ అయ్యారు. ముంబైలోని షిండే నివాసంలో వీరి సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే(NDA) సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన 1వర్గం భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండేతో సుమారు 40 నిమిషాల పాటు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబు ఏక్‌నాథ్ షిండే శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Kinjarapu Ram Mohan Naidu) ఉన్నారు.

కాగా, దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.