AP Politics: చంద్రబాబుపై కేసులు సీబీఐకి అప్పగింత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

0
26

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు మరిన్ని కేసులను నమోదు చేశారు. ఇవ్వన్నీ రాజకీయ కక్షతో పెట్టిన కేసులంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు గతంలో చంద్రబాబు చేసిన అక్రమాల ఫలితమే కేసులంటూ వైసీపీ వాదిస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులపై సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో చంద్రబాబుపై కేసులను సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరగ్గా.. పిటిషన్ విచారణ అర్హతపై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. దీనిపై పూర్తిస్థాయి కౌంటర్ దాకలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నారనే ఉద్దేశంతో సీబీఐ విచారణకు ఆదేశించడం సబబు కాదని రోహత్గీ వాదించారు. ఇప్పటికే ఐదు కేసుల్లో విచారణ పూర్తిచేసి ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులు సమీక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందని ముఖుల్ రోహత్గీ చెప్పారు. ప్రభుత్వం సమీక్షిస్తామని చెప్పినప్పటికీ న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటరే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

అక్రమ కేసులపై సమీక్ష..
వైసీపీ హయాంలో రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీనిలో భాగంగా అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం నమోదుచేసిన అక్రమ కేసులపై సమీక్షిస్తామని ప్రకటించింది. టీడీపీ ప్రభుత్వ ప్రకటనపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వంలో నమోదైన కేసులపై సమీక్షించి.. ఆ కేసులను వెనక్కి తీసుకోవడం మొదలుపెడితే ఇదో సంప్రదాయంగా మిగిలిపోతుందని, ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ కేసులపై విచారణ న్యాయస్థానం పరిధిలో ఉండటంతో.. కోర్టులకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చి విచారణ పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

ఆ కారణంతోనే..
కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండటంతో.. ఆయనపై కేసుల విచారణను రాష్ట్రప్రభుత్వ అధికారులు చేపడితే పారదర్శకత లోపిస్తుందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి అప్పగించాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. దానిపై విచారణ కొనసాగుతోంది.

CM Chandrababu Naidu Gudiwada Tour: సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News