AP Politics: ఏపీలో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్..

0
91
Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పారదర్శకమైన, నీతి, నిజాయితీతో కూడిన పాలనకు పవన్ కళ్యాణ్ నిదర్శనంగా నిలుస్తున్నారు. ఓ నాయకుడు నిస్వార్థంగా పనిచేస్తే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుచిచూపిస్తున్నారు. ఆర్థిక వనరులు లేకపోయినా.. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందించవచ్చో పవన్ కళ్యాణ్ స్వయంగా చేసి చూపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలను నిర్వహించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాలో చేయాల్సిన పనులపై చర్చించేందుకు గ్రామ సభల్లో చర్చించారు. గతంలో ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చిన కార్యక్రమాలకు, పథకాలకు వినియోగించేది. కానీ ప్రజల సొమ్ము వృధా కాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధులను వేటికోసం ఖర్చు చేయాలనే దానిపై ప్రజలతో చర్చించడం ఆయన విజన్‌ను తెలియజేస్తోంది.
ఎన్నికల్లో హామీ మేరకు..
ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నారు. ఈ సభల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలతో తీర్మానాలు చేయించారు. గ్రామ సభలను తూతూ మంత్రంగా కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేలా గ్రామ సభలను నిర్వహించారు. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం.. అనేలా పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గత ప్రభుత్వ హయాంలో..
ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో రూ.40,579 కోట్లు నిధులు రాష్ట్రానికి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ ఆ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2014-19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే 2019-23 సంవత్సరాల్లో కేవలం రూ.170 కోట్లే వచ్చింది. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తోంది. ఆయ గ్రామాల ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు నెలల కాలంలోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. రానున్న రోజుల్లో తన శాఖలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here