Maha Shivaraathri: మహాశివరాత్రి: ప్రముఖ శైవ క్షేత్రాలివే

0
19

మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల గురించి తెలుసుకుందాం.

శ్రీశైలం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య ఉన్న సంగమేశ్వర ఆలయం.. కర్నూలు నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సప్త నది సంగమ ప్రదేశంలో ప్రతీ ఏడాది వేసవిలో మాత్రమే శివుడు భక్తులకు దర్శనమిస్తాడు.

శ్రీకాళహస్తి.. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. కళంకారీ కళకు పుట్టినిల్లు. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున, వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది.

పంచారామాలు.. ఏపీలోని 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పిలుస్తారు. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామంను పంచారామాలు అంటారు.

వేములవాడ .. శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.