Vishwaksen Political Entry :విశ్వక్ సేన్ పొలిటికల్ ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్

0
14

విశ్వక్ సేన్.. టాలెంట్ ఉన్న టాలీవుడ్ కథానాయకుడు. మల్టీ టాలెంటెడ్. తనదైన ప్రత్యేక మైన సినిమాలతో.. యూత్ లోనూ.. మూవీ లవర్స్ లోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు పాటు సినిమాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు ఒక మంచి కథతో త్రో బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. చాలాకాలం తర్వాత గామి సినిమాతో శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి ప్రమోషన్ తో, విజువల్ గ్రాండియర్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు భారీ హైప్‌తో రిలీజ్ అయింది.

మూవీ రేంజ్ వేరేలా ఉండటంతో.. విశ్వక్ సేన్ నుంచి ఇంటర్వ్యూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఓ ఇంటర్వ్యూలో మీ నాన్న గారు ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో అనుకూలంగా సపోర్ట్ గా నిలిచారు.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీలో మీరు ఏదైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా అంటూ ఇంటర్వ్యూయర్ విశ్వక్ సేన్ ను ప్రశ్నించారు. దీనిపై విశ్వక్‌ నుంచి స్ట్రాంగ్ ఆన్సర్ వినిపించింది.

విశ్వక్ సేన్ చాలా తెలివిగా బదులిచ్చాడు. తను అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్.. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరిగే టైంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తా అంటూ సెటైరికల్ గా ఆన్సరిచ్చాడు. చాలా సెన్సిటివ్ ప్రశ్నలకు తనదైన వెటకారం జోడించి బదులిచ్చాడు. ఐతే.. ఎన్నికలకు ముందు.. సినిమాను పొలిటికల్ ఇష్యూల్లోకి లాగకుండా టైమింగ్ తో ఆన్సరిచ్చాడు. ఐతే.. పవన్ కల్యాణ్ కు విశ్వక్ సేన్ అన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు.