Mrunal Follow TO Shobanbabu: శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్.. తెలివైన పిల్ల

0
24

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను ఫాలో అవుతుంటారు చాలామంది మూవీ స్టార్స్. ఇందులో సక్సెస్ అయినవాళ్ల లైఫ్ సాఫీగా సాగుతుంది. లేకపోతే సినీ ఇండస్ట్రీలో చాలామంది జీవితాలు పేకమేడలా కుప్పకూలిపోతాయి. ఆఫర్లు వస్తున్న టైంలోనే వేరే ఏదైనా వ్యాపార రంగం, ఇంకేదైనా చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తుంటారు సినీ ప్రముఖులు. అలాంటి బాటలోనే కత్తిలాంటి భామ మృణాల్ ఠాకూర్ నడుస్తోంది.

మృణాల్ ఠాగూర్ అందరికంటే రెండింతలు తెలివిగా ఆలోచనలు చేస్తుంది. తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ముంబైలో బిజినెస్ మొదలు పెట్టింది. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుతున్న ఈ లక్కీ హీరోయిన్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ లో నటిస్తోంది. అవకాశాలతో పాటు పెరిగిన ఆదాయాన్ని కూడా రెట్టింపు చేయడానికి రియల్ ఎస్టేట్ వైపు కాన్సన్ట్రేట్ చేసింది. ముంబైలో ఇప్పటికే రెండు అపార్టుమెంట్స్ కూడా కొనుగోలు చేసింది. ఈ రెండు ప్రాపర్టీస్ కంగనా రనౌత్ బంధువుల ఆస్తులట. దాదాపు రూ.11 కోట్ల ఖరీదైన ఓ ఫ్లాట్‌ని కొనేసినట్లు సమాచారం.

ముంబైలోనే కాకుండా హైదరాబాద్‌లోను ఇల్లు కొనే ప్రయత్నంలో ఉందంట ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్ లోనే మృణాల్‌కు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలే కాక మరో రెండు తమిళ సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ బ్యూటీ. హైదరాబాద్ లో రియల్ బూమ్ ఉండటంతో.. ఇక్కడ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తోంది మృణాల్. భూములపై ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించిన ఏకైక టాలీవుడ్ హీరో శోభన్ బాబు. ఈ సోగ్గాడి జీవితం ఎందరికో ఆదర్శం అని చెబుతుంటారు. మృణాల్ కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం