Minister Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్..కాలేజ్ కోసం వేసిన రోడ్డును తొలగింపు

0
30

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాకిచ్చారు అధికారులు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్ హెచ్.ఎం.డి.ఏ లే అవుట్లో ఉన్న ప్రభుత్వ పార్క్ 10 గుంటల స్ధలం సుమారు (2500 గజాల స్థలాన్ని) తమ కాలేజ్ వెనుక వైపు నుండి రహదారి కలసి వస్తుందని ఆక్రమించి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు..కళాశాలకు వెల్లే రహదారిని మూసివేశారు.