జైలుకు వెళ్లకుండా ఉండేందుకు రమణ దీక్షితులు పాట్లు

0
17

టీటీడీపై, ఈవోపై అనేక ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. ఆయనను పదవి నుంచి తొలగించింది. పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తున్నారు. హాజరు కాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ఇంటి దగ్గరే విచారించాలని.. అరెస్టు చేయవద్దని ఆయన కోరుతున్నారు. ఈ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది.

శ్రీవారి సేవలో నిత్యం గోవింద గోవింద అంటూ పారాయణం చేస్తూ తన్మయత్వంతో జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిన రమణదీక్షితులు పొలిటికల్ ఇబ్బందుల్లో పడ్డారు. కుట్ర పూరిత ఆలోచనలతో చేసిన కొన్ని తప్పుల వల్ల ఎవరి మేలు కోసం చేశారో వారే ఇప్పుడు జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. వెంకటేశ్వరుడికి ఇంత సేవ చేసి.. అంత గొప్ప జీవితం అనుభవించి.. ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లకుండా ఉండేందుకు.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఉండేందుకు .. ఇబ్బందులు పడుతున్నారు.

2019 ఎన్నికలకు ముందు రమణదీక్షితుల ప్రధాన అర్చకులుగా మొత్తం ఆలయంపై హవా కొనసాగించేవారు. చంద్రబాబు, వైసీపీ ప్రధాన ప్రత్యర్థులు టార్గెట్ గా చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టారు. పింక్ డైమాండ్, పోటు తవ్వకాలు అంటూ ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆయనకు టీడీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించింది. తర్వాత లోటస్ పాండ్‌కు వెళ్లి … జగన్ సీఎం కాగానే మళ్లీ పాత పదవి వచ్చేలా హామీ తెచ్చుకున్నారు. సలహాదారు పదవి ఇచ్చినా… ఇప్పుడు తీసేసి కేసులు పెట్టారు. అనుకున్నది జరగలేదు.. జగన్ పార్టీలోనూ ఎదురుగాలి వీయడంతో.. ఇదేం ఖర్మ నాకు అనుకుంటున్నారట పెద్ద పంతులు.