కోహ్లీ 8 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసిన యశస్వి జైశ్వాల్

0
17

భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో అదరగొడుతున్నాడు. రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇంగ్లాండ్ పై ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు.

2016లో కోహ్లీ 655 పరుగులతో టాప్ లో ఉంటే తాజాగా జైస్వాల్ (712)తో ధర్మశాల టెస్టులో కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేడు . 8 ఏళ్ళ కోహ్లీ రికార్డ్ జైస్వాల్ బ్రేక్ చేయడంతో జైస్వాల్ ను కొత్త కింగ్ గా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత క్రికెట్‌కు కోహ్లీ రాజైతే.. ఇంగ్లాండ్‌పై అధిపత్యానికి జైస్వాల్ రాజని కామెంట్లు చేస్తున్నారు. ఈ యువ కెరటం ఫామ్ చూస్తే మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ధర్మశాల మ్యాచ్ ద్వారా జైస్వాల్ కేవలం 16 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. దీంతో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లే పేరిట ఉంది. అతను 14 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు