Rameshwaram Cafe Blast CCTV : రామేశ్వరం కేఫ్ లో పేలుడు..బాంబ్ పెట్టింది ఇతనే.?

0
42

బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి బ్యాగ్ తో పాటు ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకొని కేఫ్ లోకి ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. ఆ వ్యక్తి ఇడ్లి ప్లేట్ తో కేఫ్ తిరుగుతున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.  పేలుడు కారణమైన బ్యాగ్ ను వదిలేసి వెళ్ళింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు.గళూరు రామేశ్వరం కేఫ్ లో నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో పదిమందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.

బాంబ్ బ్లాస్ట్ జరిగిన రామేశ్వరం కేఫ్ ను ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. పోలీసులు,అధికారులతో కలిసి పరిశీలించారు. అంతకుముందు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా బాధితులను సీఎం పరామర్శించారు.ఈ ఘటనను అనవసరంగా రాజకీయం చేయొద్దని సిద్ధరామయ్య సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సహకరించాలని కోరారు. ఎవరో ఒక వ్యక్తి మాస్క్, క్యాప్ వేసుకుని కేఫ్ కు వచ్చినట్లు చెప్పారు. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను కేఫ్ లో ఓ మూలన వదిలేసి..టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని చెప్పాడు. అతనెవరో తెల్వదని..నిందితుడిని త్వరగా పట్టుకుంటామని తెలిపారు.