Team India All Out : టీమిండియా ఆలౌట్…259 పరుగుల ఆధిక్యం

0
24

ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్‌ కు 259 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో గిల్‌ 110, రోహిత్‌ 103, పడిక్క్‌ 65, జైస్వాల్‌ 57, సర్ఫరాజ్‌ 56 పరుగులు చేశారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్‌ 2, హార్ట్‌లీ 2, స్టోక్స్‌ ఒక వికెట్ తీశారు. కాగా ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే 31తో టీమిండియా సిరీస్ ను గెలుచుకుంది. చివరి రెండు రోజులు ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ కు అనుకూలంగా మారనుంది.

జేమ్స్ అండర్సన్ 700 వికెట్లు

ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్ గా నిలిచారు. మొత్తం 187 టెస్టుల్లో అండర్సన్ ఈ ఫీట్ సాధించారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో భారత క్రికెటర్ కుల్దీప్ యాదవు ఔట్ చేయడంతో ఈ రికార్డు నమోదైంది. కాగా మురళీ ధరన్(శ్రీలంక – 800 వికెట్లు), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా – 708 వికెట్లు)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.