ఎంపీగా పవన్ పోటీ ఇక్కడినుంచే..! బర్నింగ్ టాపిక్

0
19

పవర్ హౌజ్ పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీచేస్తారనేది ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో అంతటా చర్చ. టీడీపీ, జనసేన , బీజేపీ పొత్తులు ఖరారు అయ్యాయి. అభ్యర్థులను కూడా దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఢిల్లీ నుంచి జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్రంలో గట్టి ప్రతినిధి ఉండాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

కేంద్రంలో ఏపీ నుంచి ఒక్కరూ లేరు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డే.. ఏపీకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకోవాలి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉండటం ఆనవాయితీ. అయితే ఈ సారి ఏపీ నుంచి ప్రభుత్వంలో చేరే మంత్రులు ఎవరూ లేరు. బీజేపీ నాయకత్వం కూడా తమ పార్టీ నేతలకు ఎవరిరైనా రాజ్యసభ ఇచ్చి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఈ సారి కేంద్రంలో ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉండే అవకాశం ఉంది.

ఈ క్రమంలో పవన్ నే కేంద్ర మంత్రిగా తీసుకుంటే… బ్యాలెన్స్ అవుతుందన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్‌కు ఇప్పటి వరకూ ఎంపీగా పోటీ చేయాలన్నఆలోచన లేదు. అనకాపల్లి నుంచి ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించింది. ఆయన ఇల్లు కూడా తీుకుని రంగంలోకి దిగారు. ఎందుకో కానీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పవన్ అక్కడ్నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.