ఇక సికింద్రాబాద్ వంతు.. ఐదేళ్లలో పుల్ చేంజ్

0
22

హైదరాబాద్ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి మెట్రో కూడా సరిపోవడం లేదు. కొత్త స్ట్రాటజిక్ లింక్ రోడ్లు, డబుల్ డెక్కర్ రోడ్లు కడుతున్నారు. అలా.. ప్రభుత్వం ట్రాఫిక్ ను తగ్గించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఇక జాతీయ రహదారి – 44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పైనే మెట్రో మార్గం నిర్మించనున్నారు. తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభంకానుంది.

బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన రెండోస్థాయి పైవంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై భవిష్యత్తులో రెండో దశలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి, డెయిరీ ఫామ్ రోడ్ NH 44 వరకూ ఉంటుంది. ఇది మొత్తం ఆరు లేన్ల రహదారి. దీని వల్ల సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయి. హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుంది.

పై నుంచి సాగే ఈ రహదారికి ఈమధ్య కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అందువల్ల ఇప్పుడు ఈ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై.. తాడ్‌బండ్ జంక్షన్, బోయిన్‌పల్లి జంక్షన్ మీదుగా వెళ్తూ.. డెయిరీ ఫామ్ రోడ్డు దగ్గర ముగుస్తుంది. ఇందులో పై నుంచి వెళ్లే కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అండర్‌గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మొత్తం 73.16 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో రక్షణ శాఖ ఇస్తున్నవి 55.85 ఎకరాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ల్యాండ్ 8.41 కిలోమీటర్లు ఉంది. ఇంకా అండర్‌గ్రౌండ్ సొరంగానికి రూ.8.9 ఎకరాలు కేటాయించారు. ఇది పూర్తవ్వడానికి ఒక సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేంద్రంతో చేసిన లాబీయింగ్ వర్కవుట్ అవుతోందని రాజకీయ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. కిషన్ రెడ్డి ప్రయత్నాలు కూడా ఇందుకు దోహపడ్డట్టు చెబుతున్నారు. అలా కేంద్రం అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది.