హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. ఇటీవల అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు. దీంతో ఆయన పోలీసుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని నగరానికి చెందిన ఆశిశ్‌గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్‌లో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన రెచ్చిపోయి పోలీసుల మీద ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్లీ తిరిగి అదికారంలోకి వస్తామంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేసారు. మళ్లీ మేం అదికారంలోకి వచ్చాక వడ్డీతో సహ తిరిగి ఇచ్చేస్తామన్నారు. కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టం తస్మాత్ జాగ్రత్త అంటూ ఎవరినైనా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.