Sajjanar Tweet Viral: మీ మెదడకు పదును పెట్టి సరైన ఆన్సర్ చెప్పండి.. సజ్జనార్ ట్వీట్ వైరల్

0
17

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ ఫ్రీ జర్నీ చేస్తున్నారు. మార్చి 8 వరకే 24 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. అయితే ఈ పథకంపై ఇటీవల నిర్వహించిన ఓ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ప్రశ్న వచ్చింది. మీ మెదడుకు పదునుపెట్టి. దీనికి సమాధానం చెప్పండి అంటూ ఈ ప్రశ్నను TSRTC ఎండీ సజ్జనార్ Xలో పోస్ట్ చేశారు. ఇందులో మహిళల ఉచిత బస్సు పథకం గురించి 4 పాయింట్లు ఇచ్చారు. అందులో ఏవి సరైనవి కావో గుర్తించి సమాధానం చెప్పాలి. ఇంతకీ ఎగ్జా్మ్ లో అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం.

ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే పథకం గురించి కింది వాటిలో ఏవి సరైనవి కావు? అనేది ప్రశ్న.

1. ఈ పథకం పేరు శ్రీ లక్ష్మీ పథకం

2. ఇది బాలికలు, అన్ని వయసుల మహిళలు మరియు లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది.

3. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) తెలంగాణ గడ్డపై నడిచే అన్ని బస్సుల్లో మహిళా ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

4. ఈ పథకం ఆదివారాలు మినహా అన్ని రోజులలో అందుబాటులో ఉంటుంది.

ఎ. (1), (3) మరియు (4) బి. (1) మరియు (3)

సి. (1), (2) మరియు (4) డి. (3) మరియు