Maha Shivaratri 2024 : మహా శివరాత్రి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు

0
44

హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోతాయి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు మహాశివుడికి ఎంతో ప్రీతకరమైన రోజు కూడా.

ఈ రోజున నిష్ఠగా శివుడిని పూజిస్తే.. పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం నాడు మహాశివరాత్రిని జరుపుతారు. ఈ ఏడాది శివరాత్రి మార్చి 08 శుక్రవారం రోజున వస్తుంది. అయితే శివరాత్రి రోజున ఏం చేయాలో ఇప్పడు చుద్దాం.

శివరాత్రి నాడు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే లేవాలి. స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఇంట్లోనే గానీ, ఆలయంలోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. రాత్రంతా జాగరణం ఉండి, ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని విడవాల్సి ఉంటుంది.

ఆ రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి.