సీఎం రేవంత్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీలో ప్రధానంగా ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. మహిళలకు నెలకు రూ.2,500పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే SHG మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, రూ.5 లక్షల జీవిత బీమాపై నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ‘మహిళా శక్తి’ సభలో వీటిపై ప్రకటన చేయనున్నారు. దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను న్యాయస్థానం ఆదేశించిన మేరకు మరోసారి పేర్లను గవర్నర్ కు పంపనున్నారు.
అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలతో పాటు, 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో పాటు అనేక నిర్ణయాలను కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని తెలిసింది.