10 స్థానాల్లో బీజేపీ పోటీ.. రాజమండ్రి బరిలో పురంధేశ్వరీ.!

0
20

టీడీపీ,బీజేపీ,జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. నిన్న మూడు పార్టీల నేతలు భేటీ అయిన ఎవరు ఎన్ని సీట్లు, ఎక్కడ పోటీ చేయాలనేదానిపై చర్చించారు. అయితే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

అయితే బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందీశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. విజయనగరం నుంచి- మాజీ MLC పీవీఎన్ మాధవ్, అనకాపల్లి నుంచి- సీఎం రమేశ్, అరకు- నుంచి మాజీ MP కొత్తపల్లి గీత, నరసాపురం- సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు, తిరుపతి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ,రాజంపేట నుంచి- కిరణ్‌కుమార్‌రెడ్డిని బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన ఇప్పటికే 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. టీడీపీ సెకండ్ లిస్ట్ ఈ నెల 14న ప్రకటించనున్నారు