సత్యం సినిమాతో సక్సెస్ పుల్ మేకర్ అనే ఇంప్రెషన్ ఇచ్చాడు డైరెక్టర్ సూర్యకిరణ్. అలాంటి దర్శకుడు ఇపుడు ఈ లోకంలో లేకపోవడం చాలామందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆయన గతంలో చెప్పిన మాటలు… ఇంటర్వ్యూలు చూసి.. ఆయన గురించి స్మరించుకుంటున్నారు సినీ అభిమానులు.
చేసింది కొన్ని సినిమాలే అయినా తన మార్క్ చూపించాడు సూర్యకిరణ్. సత్యం, రాజు భాయ్ సినిమాలు సూర్యకిరణ్‌కు డైరెక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈయన బాల నటుడిగా 200 సినిమాల్లో నటించి మెప్పించాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లోనూ కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. సింగర్ కల్యాణితో ప్రేమ వివాహం.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
కళ్యాణి గురించి ఓ ఇంటర్వ్యూలో సూర్యకిరణ్ చెబుతూ.. తన అమ్మ తర్వాత అమ్మ అంటే కల్యాణే అని చెప్పాడు. కళ్యాణిని నేను ఇప్పటికీ రోజు మిస్ అవుతూనే ఉన్నానని.. నా సిస్టర్స్ పై నాకు ఎంత ప్రేమ ఉందో కళ్యాణిపై కూడా నాకు అంతే ప్రేమ ఉంది.. ఆమె నాకు ఎప్పటికీ అవసరమే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పటికి తన ఫోనట్లో, లాప్టాప్లో కళ్యాణి ఫోటో ఉంటుందని వివరించాడు. వాళ్లిద్దరికీ విడాకులు ఎందుకయ్యాయనేది ఇప్పటికీ చాలామందికి తెలియని ఓ రహస్యమే.