Pandya Out Of Gujarat Team: పాండ్యా లేకున్నా గుజరాత్ కు ఒరిగేదేం లేదు

0
22

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరో 10 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. జట్లన్నీ సిద్దమవుతున్నాయి. పస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్ జరగనుంది. ఈ సారి పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే..

పాండ్యా గుజరాత్ ను వీడి ముంబైకి ఆడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్య లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం లేదన్నాడు. పాండ్యా మిడిల్‌ ఆర్డర్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్‌.. కానీ హార్దిక్‌ లేని లోటును గుజరాత్ పూడ్చుకోగలదు. ఆ జట్టుకు బలమైన బౌలర్లు ఉన్నారు . హార్దిక్‌ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, అది అతడికి అంతగా సెట్‌ కాదు. అందుకే హార్దిక్‌ లేకున్నా గుజరాత్ బలంగానే కనిపిస్తుంది. ముంబయి ఇండియన్స్‌ తరఫున పాండ్య లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం మంచిది. హార్దిక్ అదే పని చేస్తాడని అనుకుంటున్నాను. ముంబయి తరపున పాండ్యా బెస్ట్ ఫర్ఫామెన్స్ చూపిస్తాడని ఆశిస్తున్నట్లు బ్రాడ్ హాగ్ తెలిపాడు.