విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ ఏడాది జరగబోయే T20 వరల్డ్ కప్‌లో భారత జట్టు నుంచి కోహ్లీని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్‌లు కోహ్లీకి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇచ్చేందుకు కోహ్లీ తప్పుకునేలా చర్చలు జరిపేందుకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సిద్ధమయ్యారట. ఇదే నిజమైతే కోహ్లీ టీ20 కెరీర్ దాదాపు ముగిసినట్టే..
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి యువకులకు టీ20 ఫార్మాట్‌లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందంట. ఇప్పటికే గాయంతో టీ20కి వరల్డ్ కప్ కు షమీ దూరమయ్యాడు. అలాగే బుమ్రా ఆడేది కూడా డౌట్ గానే ఉంది.
పాకిస్థాన్, అమెరికా, కెనడాలతో పాటు భారత్ గ్రూప్-ఎలో ఉన్నాయి. టీమిండియా జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న యూఎస్‌ఏతో, జూన్ 15న కెనడాతో తలపడనుంది. MS ధోని కెప్టెన్సీలో 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును గెలిపించినప్పటి నుంచి భారత్ ఒక్క ICC ట్రోఫీ గెలవలేదు.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ – జూన్ 5 న్యూయార్క్‌లో
భారత్ వర్సెస్ పాకిస్థాన్ – జూన్ 9న న్యూయార్క్‌లో
ఇండియా vs USA – జూన్ 12 న్యూయార్క్‌లో
ఇండియా vs కెనడా – జూన్ 15 ఫ్లోరిడాలో